VIDEO: ఆ జాతరకు 130 ఏళ్ల చరిత్ర..!

VIDEO: ఆ జాతరకు 130 ఏళ్ల చరిత్ర..!

NLG: చందంపేట మండలం చిత్రియాలలో 130 ఏళ్ల చరిత్ర కలిగిన అంకాలమ్మ జాతర నేటి నుంచి వారం రోజుల పాటు కొనసాగనుంది. శ్రావణమాసం సందర్భంగా జరిగే అమ్మవారి జాతరలో కాటమయ్య బోనాలు, అమ్మవారి ఊరేగింపు ప్రధాన ఘట్టాలుగా నిలవనున్నాయి. ఇందుకోసం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వారం రోజుల పాటు భక్తులు ఉపవాస దీక్ష ఆచరించి నియమనిష్ఠలతో అమ్మవారిని పూజిస్తారు.