'మందులను వాడి క్షయ వ్యాధిని నివారించవచ్చు'

'మందులను వాడి క్షయ వ్యాధిని నివారించవచ్చు'

ADB: క్రమం తప్పకుండా మందులను వాడి క్షయ వ్యాధి నివారించవచ్చునని జిల్లా వైద్య అధికారిని డాక్టర్ సుమలత తెలియజేశారు. ఇవాళ  రూరల్ మండలంలోని బీమ్ సారి గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి 68 మందికి ఎక్స్ రే, బీపీ పలు పరీక్షలు నిర్వహించారు. వారం రోజులకు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.