కటక్‌లో మ్యాచ్.. ఈ సారైనా భారత్ గెలుస్తుందా?
భారత్, సౌతాఫ్రికా ఇవాళ తొలి T20లో తలపడనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ జరిగే కటక్‌లో IND ఆడిన 3 T20ల్లో ఒక్కటే గెలిచింది. ఆ ఓడిన రెండూ SA చేతిలోనే(2015, 22). దీంతో ఈ సారైనా IND.. SAను ఓడించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అటు ఇరుజట్ల మధ్య పొట్టి ఫార్మాట్ గణాంకాలు INDకే అనుకూలంగా ఉన్నాయి. ఇప్పటివరకు 31 T20లు జరగ్గా IND 18-12తో SAపై ఆధిపత్యం కొనసాగిస్తోంది.