చికిత్స పొందుతూ యువకుడు మృతి
MLG: తాడ్వాయి మండలం కేంద్రంలో శనివారం సాయంత్రం బైకును లారీ ఢీకొట్టగా విష్ణు, రాజు అనే యువకులకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. అయితే వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాజు ఆదివారం ఉదయం మృతి చెందాడు. అలాగే విష్ణు పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.