ఈ ప్రాంతాలలో విద్యుత్ కట్
CTR: చిత్తూరు ట్రాన్స్‌కో అర్బన్ డివిజన్ పరిధిలో శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్టు ఈఈ మునిచంద్ర తెలిపారు. విద్యుత్ లైన్‌ల మరమ్మతుల దృష్ట్యా చిత్తూరు, గుడిపాల, యాదమరి, ఐరాల, తవణం పల్లె, బంగారుపాలెం మండలాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. ప్రజలు గుర్తించాలని కోరారు.