VIDEO: ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
SRD: విద్యార్థులు ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. శనివారం మండల కేంద్రమైన కంగ్టి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. కలెక్టర్గా, హెచ్ఎంగా, డిఈవోగా విద్యార్థులు విధులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో రహీమొద్దీన్, ప్రధానోపాధ్యాయురాలు శైలజ కులకర్ణి, ఉపాధ్యాయులు ఉన్నారు.