సీహెచ్‌వోల సమస్యల పరిష్కారానికి హామీ

సీహెచ్‌వోల సమస్యల పరిష్కారానికి హామీ

GNTR: ఆరోగ్య శాఖ కమిషనర్‌ను ఏపీఎంసీఏ నేతలు ఇవాళ మంగళగిరిలో కలిశారు. పెండింగ్ ఈపీఎఫ్, ఇన్సెంటివ్‌లు కేంద్ర నిధులు రాగానే చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బదిలీల్లో వితంతువులు, అనారోగ్య బాధితులు, దంపతులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. జీతాల సవరణపై సానుకూలంగా స్పందించారు. రాత్రి 8 గంటల ఫేసియల్ హాజరు తొలగించినందుకు నేతలు కమిషనర్‌కు ధన్యవాదాలు తెలిపారు.