'సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి'

'సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి'

SRCL: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎస్సై ప్రశాంత్ రెడ్డి సూచించారు. కోనరావుపేట మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటుచేసిన కమ్యూనిటీ సదస్సులో ఎస్సై మాట్లాడారు. ఈ మధ్యకాలంలో గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంకు అధికారులుగా, ఆరోగ్యశ్రీ అధికారులుగా ఫోన్ చేసి నమ్మిస్తూ అమాయకుల నుంచి బ్యాంక్ అకౌంట్ వివరాలు ఓటీపీలు అడుగుతున్నారని తెలిపారు.