నేడే రాఖీ.. జోరందుకున్న రాఖీ విక్రయాలు

HYD: నగరంలో రాఖీ విక్రయాలు జోరందుకున్నాయి. ఏ షాప్ చూసినా జనాలతో కిక్కిరిసిపోయాయి. ఈ రోజు పండుగ కావడంతో తమ సోదరులకు రాఖీ కట్టేందుకు మహిళలు ఎంతో మక్కువతో షాప్స్ వద్ద విక్రయాలు చేస్తున్నారు. రూ.10 నుంచి 1200 వరకు వివిధ ఆకారంలో రాఖీల ధరలు ఉన్నాయి. వీటితో పాటు స్వీట్ షాప్స్‌కు కూడా మంచి గిరాకీ అవుతోంది.