గుర్తుతెలియని వాహనం ఢీ.. రైతుకు తీవ్ర గాయాలు

గుర్తుతెలియని వాహనం ఢీ.. రైతుకు తీవ్ర గాయాలు

NGKL: ఊర్కొండ మండలంలోని సూర్యలత స్పిన్నింగ్ మిల్ సమీపంలో రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో సాకలి అంజయ్య (45) అనే రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై కల్వకుర్తి నుంచి తన స్వగ్రామం రామిరెడ్డిపల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అంజయ్య కాలు విరగడంతో స్థానికులు 108 అంబులెన్స్‌‌లో అతన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.