అన్నారం సరస్వతి బ్యారేజీలో పెరుగుతున్న వరద ప్రవాహం

BHPL: మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతి బ్యారేజీలో వరద ప్రవాహం బాగా పెరిగింది. బుధవారం ఉదయం 4,68,558 క్యూసెక్కుల వరద నమోదైనట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. నీటి మట్టం 111.3 మీటర్లుగా ఉంది. 65 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి కూడా నీటిని విడుదల చేశారు.