హోటల్స్ క్లోజ్.. అన్నా క్యాంటీన్‌లకు రద్దీ

హోటల్స్ క్లోజ్.. అన్నా క్యాంటీన్‌లకు రద్దీ

AP: వాణిజ్య LPG కొరతతో రాష్ట్రంలో పలు హోటళ్లు మూతపడుతుండటంతో అన్నా క్యాంటీన్లపై ఒత్తిడి పెరుగుతోంది. గతంలో ఒక్కో కేంద్రంలో 500 మందికి భోజనం అందించగా, ప్రస్తుతం అదనంగా 150 మీల్స్ సరఫరా చేస్తున్నారు. సాధారణంగా మధ్యాహ్నం 3 గంటల వరకు అందే భోజనం.. రద్దీ వల్ల 2 గంటలకే అయిపోతోందని నిర్వాహకులు తెలిపారు. హోటళ్లు మూతపడటంతో సామాన్యులు, విద్యార్థులు అన్నా క్యాంటీన్లనే ఆశ్రయిస్తున్నారు.