'ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలి'
VZM: రాజాం Dy MPDO శ్రీనివాసరావు గురువారం స్దానిక గడిముడిదాంలో తడిచెత్త, పొడిచెత్తపై మహిళలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. చెత్తను పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చినప్పుడు వేరుచేసి ఇవ్వాలని సూచించారు. వీధులలో రోడ్లపై ఉన్న చెత్తను సేకరించి చెత్త సంపద కేంద్రానికి తరలించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్లాస్టిక్ వాడకాలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలన్నారు.