ఈనెల 24న మెగా జాబ్ మేళా

ఈనెల 24న మెగా జాబ్ మేళా

VSP: గోపాలపట్నం జడ్పీ హైస్కూల్‌లో ఈనెల 24న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. పాఠశాలలో దీనికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు. గతంలో నిర్వహించిన మేళాల ద్వారా సుమారు 1,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని ఆయన గుర్తుచేశారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.