'పెన్షనర్ల బకాయిలను వెంటనే చెల్లించాలి'
NZB: 2024 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన పెన్షనరీ బకాయిలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నేడు పెన్షనర్స్ భవన్‌లో జిల్లా అధ్యక్షుడు కే రామ్మోహన్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ కూడా ఇవ్వటం లేదని వ్యాఖ్యానించారు.