నర్సీపట్నంలో 'బడి పిలుస్తుంది ర్యాలీ'
AKP: నర్సీపట్నం జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు సోమవారం విద్యార్థులతో కలిసి 'బడి పిలుస్తుంది' అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల నుంచి చుట్టుపక్కల ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించి నూతన విద్యార్థులను తమ పాఠశాలలో చేరాలని ఆహ్వానించారు. తమ పాఠశాలలో ఉన్న సదుపాయాలను తల్లిదండ్రులకు వివరించారు. మంచి ఉత్తీర్ణత శాతం సాధించే విధంగా పనిచేస్తున్నామన్నారు.