ములుగు జిల్లా ఎస్పీగా సుధీర్ రాంనాథ్ కేకన్
ములుగు జిల్లా ఎస్పీగా సుధీర్ రాంనాధ్ కేకన్ బాధ్యతలు స్వీకరించారు. కొద్దిసేపటి క్రితం జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకున్న ఆయన విధుల్లో చేరారు. జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారులు కేకన్కు ఘన స్వాగతం పలికారు. నిన్నటి వరకు ములుగులో ఎస్పీగా ఉన్న శబరీష్ మహబూబాబాద్‌కు బదిలీ కాగా.. అక్కడ ఎస్పీగా పనిచేస్తున్న కేకన్‌ను ములుగుకు బదిలీ చేశారు.