అధికార పార్టీకి వంత పాడుతున్న పోలీసులు: ఎంపీ

MBNR: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి పోలీసులు వంత పడుతున్నారని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావును మంగళవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై ఆమె స్పందించారు. అరెస్టు చేయడం దుర్మార్గమైనచర్య అని ఖండించారు. ఘర్ ఘర్ తిరంగా దేశభక్తి కార్యక్రమంలో భాగంగా పెద్దమ్మ గుడిలో పూజలకు వెళుతుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు.