యువతి అదృశ్యంపై కేసు నమోదు

యువతి అదృశ్యంపై కేసు నమోదు

CTR: యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై షేక్ షా వలి తెలిపారు. సదుంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన శ్రావణి (23) గత మంగళవారం ఇంటి నుంచి వెళ్లిపోయింది. పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.