పాఠశాల రికార్డులను పరిశీలించిన ఎంఈఓ

పాఠశాల రికార్డులను పరిశీలించిన ఎంఈఓ

SRD: సంగారెడ్డి మండలం ఫసల్వాది ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను మండల విద్యాధికారి విద్యాసాగర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, పాఠశాల రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.