ఏసీబీ వలలో అడిషనల్ కలెక్టర్
హన్మకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ ప్రైవేటు స్కూల్ రెన్యూవల్ కోసం రూ. 60 వేలు లంచం తీసుకుంటుండగా అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి ఏసీబీకి దొరికిపోయారు. ఈ మొత్తం లంచాన్ని తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన హన్మకొండ డీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.