‘మోదీ రాక రాష్ట్రానికి బలం చేకూర్చింది’

AP: అమరావతి పునర్ నిర్మాణ సభ మహా సంద్రాన్ని తలపించిందని టీడీపీ నేత, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రధాని మోదీ రాక రాష్ట్రానికి బలం చేకూర్చిందని ఆయన పేర్కొన్నారు. వైయస్ జగన్ అమరావతిని విధ్వంసం చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. ప్రజలు కూటమికి విజయం కట్టబెట్టడంతో ఇప్పుడు అమరావతి ఊపిరి పోసుకుందని వ్యాఖ్యానించారు.