రంగారావుపేట సర్పంచ్‌గా విద్యావంతుడు విజయం
JGL: మెట్ పల్లి మండలం రంగారావుపేట గ్రామ సర్పంచ్‌గా విద్యావంతుడు గుర్రం బాలరాజ్ ఘన విజయం సాధించారు. ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేసిన బాలరాజ్‌కు గ్రామ ప్రజలు పట్టం కట్టారు. విద్య, అభివృద్ధి, పారదర్శక పాలనతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని నూతన సర్పంచ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. యువ నాయకుడి గెలుపుతో గ్రామంలో ప్రజలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.