క్వారీపై ప్రజాభిప్రాయ సేకరణ

PPM: ఆర్డీవో హేమలత సమక్షంలో గురువారం నర్సిపురం పంచాయతీ పరిధిలోని హెచ్. కారాడవలసలో వెలుగుకొండ గ్రానైట్ క్వారీపై ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమతులు ఇస్తే కాలుష్యంతో పంట పొలాల పైన ప్రజల ఆరోగ్యం పైన ప్రభావం ఎక్కువగా ఉంటుందని గ్రామస్థులు ఆందోళన చెందారు. కాబట్టి కొండ తవ్వకానికి అనుమతులు ఇవ్వొద్దని అధికారులను కోరారు.