CMRF చెక్కుల పంపిణీ చేసిన మంత్రి

CMRF చెక్కుల పంపిణీ చేసిన మంత్రి

ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అర్హులైన 77 మంది లబ్ధిదారులకు రూ.53.71 లక్షల విలువైన చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా భారీ సాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అనంతరం అందిన సాయంపై లబ్ధిదారులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.