పొంగిపొర్లుతున్న వాగులు.. నిలచిపోయిన రాకపోకలు

పొంగిపొర్లుతున్న వాగులు.. నిలచిపోయిన రాకపోకలు

ప్రకాశం: ఇటీవల కురుస్తున్న వర్షాలకు దోర్నాల మండలంలో వాగులు పొంగుతున్నాయి. దీంతో మండలంలోని గంటవాని పల్లి గ్రామానికి చెందిన ప్రజలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామానికి మధ్యలో ఉన్న వాగు నిండుగా నీరు పారడంతో ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు గ్రామానికి వెళ్లలేకపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.