నివాళులర్పించిన ఎమ్మెల్యే వరద
KDP: అనకాపల్లి ఎంపీ రమేష్ నాయుడు తల్లి చింతకుంట రత్నమ్మ బుధవారం మరణించారు.ఈ విషయం తెలుసుకున్న ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి బుధవారం మధ్యాహ్నం పూట్లదుర్తిలోని వారి స్వగృహానికి వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం రమేష్ నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.