సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన ఎమ్మెల్సీ

RR: చౌదరిగూడ మండలం పెద్దఎల్కిచర్ల గ్రామానికి చెందిన అజహార్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న కారణంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదలైన రెండు లక్షల రూపాయల విలువైన చెక్కును ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గురువారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధిని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పేద ప్రజలకు ఈ పథకం వరం లాంటిదన్నారు.