దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ
GDWL: కేటీదొడ్డి మండలం వెంకటాపురంలో వెలసిన పాగుంట లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెతో పాటు పాల్గొన్నారు.