బ్లాక్ స్పాట్‌లలో మళ్లీ ప్రమాదాలు జరగకూడదు

VZM: జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టుగా గుర్తించిన బ్లాక్ స్పాట్ ప్రదేశాల్లో మరో ప్రమాదం జరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత ప్రభుత్వ శాఖలపై వుందని జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అన్నారు. ఆ దిశగా ఆయా శాఖలు చేపట్టాల్సిన కార్యాచరణపై నివేదిక రూపొందించి 2రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు.