ఘనంగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారె ఊరేగింపు

ఘనంగా శ్రీ గౌరీ పరమేశ్వరుల సారె ఊరేగింపు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ గవర వీధి శ్రీ గౌరీ పరమేశ్వర ఆలయంలో శనివారం ఘనంగా సారె ఊరేగింపు నిర్వహించారు. వందలాది మంది మహిళలు గౌరీ పరమేశ్వరులకు మొక్కులు తీర్చుకున్నారు. తాము కోరుకున్న నైవేద్యాన్ని తల మీద పెట్టుకుని ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఊరేగింపు పట్టణ పురవీధుల గుండా కొనసాగి తిరిగి ఆలయం వద్దకు చేరుకుంది.