ఎన్యూమరేటర్‌లు, సూపర్వైజర్‌లకు శిక్షణ
PLD: నూజెండ్ల మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం సెన్సస్-2027లో భాగంగా ఎన్యూమరేటర్‌లు, సూపర్వైజర్‌లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నూజెండ్ల ఎమ్మార్వో రమేశ్, ఏఎస్వో నాగశ్రీనివాసరావు ప్రారంభించారు. ఎన్యూమరేటర్‌లు 26 మంది, సూపర్వైజర్‌లు ఐదుగురు పాల్గొన్నారు.