VIDEO: ఇంటర్ మొదటి రోజు పరీక్షకు 61 మంది గైర్హాజరు...
JN: జనగామ పట్టణ కేంద్రంలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలకు 61 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పట్టణంలోని 8 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 2,157 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 2,096 మంది మాత్రమే పరీక్ష రాశారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని తెలిపారు.