కొండపర్వలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
ఎన్టీఆర్: విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక కార్యకర్త శివ సత్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మాజీ ఉప ప్రధాని, కేంద్ర మంత్రిగా దేశానికి సేవలందించారన్నారు. అలాగే సామాజిక సమానత్వం కోసం పోరాడారని కొనియాడారు.