కేటీఆర్, హరీష్ రావుకు పొంగులేటి వార్నింగ్
TG: కేటీఆర్, హరీష్ రావుకు మంత్రి పొంగులేటి వార్నింగ్ ఇచ్చారు. వారి అవినీతి చిట్టా అంతా ప్రభుత్వం దగ్గర ఉందన్నారు. త్వరలో అన్నీ బయటకు వస్తాయన్నారు. వారి తాటాకు చప్పుళ్లకు భయపడం.. ఖబడ్దార్ అని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు అధికారంలోకి రాకముందు ఆస్తులు ఎంత? ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎంత? అని ప్రశ్నించారు. దేశంలో ఏ పార్టీకి లేనన్ని ఆస్తులు BRSకు ఉన్నాయన్నారు.