ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు

ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు

WGL: వసంత నవరాత్రుల సందర్భంగా WGLలోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు అమ్మవారికి అభిషేకాలు చేసి.. వివిధ రకాల పువ్వులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.