బీఆర్ఎస్‌లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నేత

బీఆర్ఎస్‌లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నేత

SRCL: వేములవాడ పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నాగుల రాము గౌడ్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహరావు సమక్షంలో పార్టీలో చేరగా, ఆయన పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాము గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అబద్దాల హామీలు ఇచ్చి మోసం చేసిందని పేర్కొన్నారు.