జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని ధర్నా
VZM: గజపతినగరం మండలంలోని పురిటిపెంట జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కాలనీవాసులు సోమవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు పురిటిపెంట సచివాలయం వద్ద సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులకు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాలనీవాసులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాలనీలోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.