VIDEO: రాజమండ్రిలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

E.G: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాజమండ్రి అర్బన్, రూరల్ పరిధిలోని పలు ప్రాంతాలలో సోమవారం భారీ వర్షం కురుస్తుంది. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అకాల వర్షంతో చిరు వ్యాపారస్తులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.