నిడమనూరు చెరువు నుంచి హలియాకు త్రాగునీరు..?

NLG: నిడమనూరులోని నల్లచౌట చెరువును మినీ రిజర్వాయర్‌గా మార్చి హలియా పట్టణానికి త్రాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పక్కనే ఉన్న సాగర్ ఎడమ కాలువ ద్వారా ఈ చెరువును నింపనున్నారు. ఇందుకోసం నీటిని నింపేందుకు ప్రత్యేక తూము ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో మండల కేంద్రంతో పాటు హాలియాకి నీరు అందుతుందని పేర్కొన్నారు.