రైతుల ఆత్మహత్యాయత్నంపై జేడీ విచారణ

KRNL: సి. బెళగల్ మండలం పోలకల్లు గ్రామంలో ఉల్లి పంట నష్టాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు యువ రైతుల ఘటనపై శనివారం అధికారులు స్పందించారు. వ్యవసాయ సంయుక్త సంచాలకురాలు వరలక్ష్మి, తహసీల్దార్ వెంకటలక్ష్మి, ఏవో మల్లేష్ కుమార్ గ్రామానికి చేరుకుని ఉల్లి నిల్వలను పరిశీలించారు. నష్టాల వివరాలు తెలుసుకునేందుకు మధన్‌మోహన్ గౌడ్ కూడా ప్రత్యేకంగా విచారణ చేపట్టారు.