కూటమి నేతల కృషి ఫలితంగానే రైల్వే జోన్

కూటమి నేతల కృషి ఫలితంగానే రైల్వే జోన్

VZM: కూటమి నేతల కృషి ఫలితంగానే విశాఖ రైల్వే జోన్ కల సాకరమయ్యిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. జోన్ కోసం జీఎంను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడటం హర్షణీయమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపడం వల్లే ఇది సాధ్యమైందని, రూ.150 కోట్ల నిధులు కూడా కేటాయింపు చేశారని పేర్కొన్నారు.