'నిబంధన ప్రకారం ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవాలి'
MBNR: ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. ఇవాళ కోయిలకొండ మండలం అనంతపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటి నిర్మాణానికి ఎక్కువ ఖర్చు చేయకుండా ప్రభుత్వ డిజైన్ ప్రకారం చక్కగా నిర్మించుకోవాలని అన్నారు.