రైల్వే అధికారులతో సమావేశమైన కనిగిరి ఎమ్మెల్యే
ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కనిగిరి ప్రాంతానికి సంబంధించిన రైల్వే సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన రైల్వే సౌకర్యాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అధికారులు కూడా సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.