ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామంలోని 44 హైవే సమీపంలో గురువారం తెల్లవారుజామున టిప్పర్ లారీ, ఐచర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐచర్ వాహనంలో ప్రయాణిస్తున్న క్లీనర్ అనుదీప్ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ అక్షయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.