'పెద్ది' సాంగ్ కోసం ప్రత్యేక సెట్ ?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో 'పెద్ది' మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా తదుపరి షెడ్యూల్‌లో చరణ్, జాన్వీ కపూర్‌లపై ఓ సాంగ్ షూట్ చేయనున్నారు. అందుకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్ వేస్తున్నారట. ఇక ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది.