వర్ష సూచన.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి

వర్ష సూచన.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి

KMM: జిల్లాలో వర్షాభావం, ముందస్తూ జాగ్రత్తలపై అధికారులతో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 14 నుంచి 17 వరకు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసినందున అప్రమత్తంగా ఉంటూ హెడ్ క్వార్టర్‌లో అందుబాటులో ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.