ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరువారూర్ సమీపంలో ఓ బస్సును మినీవ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా.. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.