యాడారంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

యాడారంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

KMR: బిబిపేట్ మండలంలోని యాడారం గ్రామంలో ప్రభుత్వ వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని, గ్రామ సర్పంచ్ సుధారాణి బాపురెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో నర్సాగౌడ్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.