పోలీస్ కమిషనర్ PGRS‌కు 120 ఫిర్యాదులు

పోలీస్ కమిషనర్ PGRS‌కు 120 ఫిర్యాదులు

విశాఖ నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం నిర్వహించిన పీజిఆర్ఎస్‌కు 120 ఫిర్యాదులు వచ్చినట్లు CP శంఖబ్రత భాగ్చి తెలిపారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, దాంపత్య గొడవలు, మోసాలు, సివిల్ కేసులకు సంబంధించిన అంశాలు ఎక్కువగా వచ్చాయన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.